Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్ పాల్

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్ పాల్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
మహాలక్ష్మి నగర్ వాసవి హై స్కూల్ బెల్దే భవన్ లో నిర్వహించిన వాసవి యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథులుగా  ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య పెద్దలు, అధ్యక్షా & కార్యదర్శులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతు ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు.

సంపద సృష్టించడంలోకూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు చెల్లెస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు.

అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నాం. అని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగాలి ప్రభుత్వ ఏర్పాటులో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువజన సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన వారందరిని అభినందిస్తూ ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్షా & కార్యవర్గం గుర్తుపెట్టు కోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సంఘ అభివృద్ధిలో కృషి చేయాలనీ విజ్ఞప్తి చేశారు.‌ ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా నూతనంగా ఎన్నికైన యువజన సంఘంలో అధ్యక్షుడిగా తోడుపునూరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నర్సింగ్ రావు గుప్తా, కోశాధికారి పసుపునూరి రఘునాథ్ గుప్తా, మరియు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad