నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వెంకట రామారెడ్డి చేసిన సేవలు మరువలేనివని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆదివారం జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వెంకట రామారెడ్డి స్థాపించిన వసతి గృహాల నుండి సినారె, రావి నారాయణరెడ్డి, చెన్నారెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు, సాయుధ పోరాట యోధులు వచ్చారని, కలెక్టరేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి గౌరవం ఇవ్వాలని జిల్లా రెడ్డిల తరఫున కోరారు.
నిజాం కాలంలో కోత్వాల్‌గా పనిచేసిన రామారెడ్డి రెడ్డిల ధైర్యాన్ని చూపించారని, రెడ్డిలు పదిమందికి అన్నం పెట్టే రైతన్నలని అన్నారు. ఇటీవల కాలంలో తీన్మార్ మల్లన్న తన స్వార్థం కోసం రెడ్డిలను అసభ్యకరంగా మాట్లాడుతూ కించపరుస్తున్నాడని,ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే రెడ్డిలందరూ ఊరుకోరని, ఊర్లలో తిరగనివ్వమని,ఇతర బీసీ నాయకులందరూ రెడ్డిలను గౌరవిస్తారని పేర్కొన్నారు. రెడ్డిలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యత చాటాలని , విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం తమలో తామే పోటీ పడాలని అభినందించారు.పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పూర్మాని రామలింగారెడ్డి, బాణాపురం రంగారెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, పాతూరి మహేందర్ రెడ్డి, పొన్నాల బాల్ రెడ్డి, నల్ల నాగిరెడ్డి, ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోద రెడ్డితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, మండల, గ్రామ రెడ్డి సంఘం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వెంకట రామారెడ్డి చేసిన సేవలు మరువలేనివి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES