నవతెలంగాణ – వనపర్తి
ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేయడానికి వనపర్తి జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్ గా హాజరు కాలేకపోవడం, ఒక పూట కళాశాలకు వచ్చి మరొక పూట రాకపోవడం వంటి వాటిని అరికట్టడానికి ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియను ప్రారంభించారు.
విద్యార్థులు కళాశాలకు హాజరు కాకపోతే వెంటనే వారి తల్లిదండ్రుల చరవాణికి సందేశం వెళ్తుంది. ఈ హాజరు రోజులో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నమోదు చేయబడుతుంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా, డ్రాప్ అవుట్స్ ను తగ్గించవచ్చు. దీనివలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, కళాశాలల సామర్థ్యం, ఖచ్చితత్వం పెరుగుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని ఖిలా ఘన్ పూర్ మరియు గోపాల్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల ను జిల్లా ఇంటర్ విద్యాధికారి సందర్శించి పరిశీలించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES