సీరియల్ ప్రభావం నుంచి బయట పడేసేందుకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం
నవతెలంగాణ – కంఠేశ్వర్
సీరియల్ ప్రభావం పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సీరియల్ ప్రభావం నుంచి బయట పడేసేందుకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని నాందేవాడలో ల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..ప్రాణాలు తీస్తున్న టీవీ సీరియల్స్ మహబుబ్ నాగర్ లో ఓ గ్రామంలో రైతు కుటుంబానికి ఏర్పడింది. సీరియల్లో ముఖ్యంగా మహిళలే విలన్ పాత్ర పోషించడం వల్ల తన కుటుంబంలో తన చుట్టూ ఉంటూనే తనపై ఎవరు దాడి చేస్తారో తెలవని పరిస్థితి మన కుటుంబాల్లో కూడా చూస్తున్నాం. ఎందుకు అంటే అత్తను ఏ రకంగా చంపాలి ఆడబిడ్డను ఎరకంగా హింసించాలి, కోడల్ని ఏ రకంగా హింసించాలి అనేది ప్రధానమైన విలన్ పాత్రలను మహిళలతో చేయించడం వల్ల మహిళలు కూడా హత్యలు చేస్తున్న సంఖ్య మనం చూస్తున్నాం.
గతంలో అయితే మహిళలు హత్యలకు గురైన చరిత్ర ఉంది గాని మహిళ హత్య చేసిన చరిత్ర లేదు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సీరియల్ లను చూపించాలి అంటే గతంలో రాజ్యాలను పరిపాలించినటువంటి రాజుల చరిత్రలను రానుల చరిత్రలను చూపించేవారు ఇప్పటికీ కూడా భారత దేశంలో ఎంతోమంది మహానీయులు ఉన్నారు. జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్ లాంటి మహానీయుల చరిత్రను సీరియల్లలో చూపించాలి ఎందుకంటే పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మహానీయుల చరిత్ర తెలిసి ఉండాలి ఈ ప్రభావం ప్రతి ఒక్క కుటుంబంలో పడుతుంది కాబట్టి మేధావులు ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో సీరియల్ ప్రభావం పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న సమయంలో ఐద్వా ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా ఈ ప్రభావం నుంచి బయట పడేసేందుకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామం అని ప్రభుత్వాలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు కళ, సభ్యులు లక్ష్మీ పాల్గొన్నారు.
సీరియల్ ప్రభావం పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి
- Advertisement -
- Advertisement -