నవతెలంగాణ – వనపర్తి
ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను సాహితీ కళావేదిక సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఆదివారం శాలువాలు, పూలబొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు కవితలు చెబుతూ, పాటలు పాడుతూ , సతీష్ యాదవ్ ను అభినందించారు. రాబోవు కాలంలో అందరం కలిసి వనపర్తినీ కాపాడుతూ సమాజ అభివృద్ధికి, దోహదం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, కవి బై రోజు చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు గౌరవ డాక్టరేట్ కంటీ నిరంజనయ్యా, వనపర్తి గద్దర్ రాజారామ్ ప్రకాష్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కవి సత్తార్, బహుజన వేదిక అధ్యక్షుడు గంధం నాగరాజు, జై భీమ్ సేన అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు డి రాములు, ఉపాధ్యాయుడు రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సతీష్ యాదవ్ కు ఘన సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES