- Advertisement -
- – కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎవరూ బాగుపడలేదని ఆయన కుటుంబం మాత్రం బాగుపడిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పద్మశాలీల కోసం ఏమీ చేయలేదని పద్మశాలీలు ఏం బాగుపడ్డారో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మహేందర్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులో, సిరిసిల్ల పద్మశాలిలకు రూ. 4,888 కోట్లు అప్పులు పెట్టారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇన్‌పుట్ సబ్సిడీ తెచ్చి బకాయిలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ పేర్కొంది.తమ ప్రభుత్వం యార్న్ డిపో ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకు నూలు త్వరగా దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు.బతుకమ్మ చీరలు గత ప్రభుత్వంలో నాణ్యత లేనివిగా ఉండేవని, ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మంచి నాణ్యమైన చీరలు తయారు చేయిస్తున్నామని, కేటీఆర్ నేతన్నలను, పద్మశాలి వ్యాపార సంఘాలను బెదిరించి ఎన్నికల్లో వాడుకున్నారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు మేము చేస్తే భోగాలు మీరు అనుభవిస్తున్నారని, అపెరల్ పార్కులో ప్రతి కార్మికుడికి షెడ్ ఇస్తానని కేటీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని,బడ్జెట్‌లో దీనికోసం నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.
కేటీఆర్ రాజకీయాలు రాష్ట్రానికి నష్టం కలిగించాయని, పిచ్చి మాటలు ఆపాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గడ్డం నర్సయ్య ఆకునూరి బాలరాజు వైద్య శివప్రసాద్ కల్లూరి చందన ఆడెపు చంద్రకళ దుబల వెంకటేశం బొద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -