Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంచట్టవిరుద్ధ పనుల్లో హిమంతవిశ్వ శర్మ

చట్టవిరుద్ధ పనుల్లో హిమంతవిశ్వ శర్మ

- Advertisement -

దోపిడీ గురించి బయటికి తెలియకుండా ప్రయత్నాలు
ఆదివాసీల భూములు అదానీ వంటి కంపెనీలకు
అసోం సీఎంపై ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపణలు
న్యూఢిల్లీ :
అసోం సీఎం హిమంతవిశ్వ శర్మపై ప్రముఖ సీనియర్‌ నాయ్యవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రతి ఒక్క చట్టవిర్ధుమైన కార్యక్రమాల్లో నిమగమై ఉన్నారని అన్నారు. ఈ దోపిడీని బాహ్య ప్రపంచం నుంచి దాచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదానిపై ప్రజలెవరికీ తెలియకుండా వారిని హిమంత సర్కారు నిరోధిస్తున్నదని చెప్పారు. ” హిమంత విశ్వ శర్మ నేతృత్వంలోని అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఒక్క చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాల్లో ఉంటున్నది. ప్రత్యేకించి పౌరులను అక్రమంగా బంగ్లాదేశ్‌కు, దేశం బయటకు పంపించివేస్తున్నది. ప్రజలను తమ స్వంత భూముల నుంచి తరలించేస్తున్నది. వారి ఇండ్లను కూల్చివేస్తున్నది. వ్యవసాయపరంగా మంచి ఉత్పాదకతను అందించే ఆదివాసీల భూములను అదానీ గ్రూపుతో పాటు ఇతర కంపెనీలకు అక్రమంగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నది. రాష్ట్రంలో పూర్తిగా దోపిడీ జరుగుతోంది. దానిని సీఎం దాచాలనుకుంటున్నారు. అందుకే స్వతంత్ర వ్యక్తులను ఆయన నిరోధిస్తున్నారు” అని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి విదేశీ శక్తులతో కలిసి రాష్ట్రాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రశాంత్‌భూషణ్‌తో పాటు కాంగ్రెస్‌, జమాత్‌-ఎ-ఇస్లామీ-హింద్‌, మేధావులు హర్ష మందర్‌, వజాహాత్‌ హబీబుల్లాతో పాటు పలువురిపై అంతకముందు హిమంత విశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన ప్రశాంత్‌ భూషణ్‌.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వస్తున్న ఇలాంటి వారిని చూసి హిమంత సర్కారు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. సీనియర్‌ జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులు బనాయించటాన్ని విమర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad