Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లైబ్రరీ శాఖలో కనిపించని అధికారులు

మద్నూర్ లైబ్రరీ శాఖలో కనిపించని అధికారులు

- Advertisement -

– ఎప్పుడూ ఏ రోజైనా ఖాళీ కుర్చీ దర్శనం
నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో గల లైబ్రరీ శాఖలో లైబ్రేరియన్ ఏనాడు కూడా కనిపించడం లేదు. అనే వాదనలు పాఠకుల్లో వ్యక్తం అవుతున్నాయి. మద్నూర్ లైబ్రరీకి ఇన్చార్జి లైబ్రరీ ఉన్నట్లు తెలుస్తోంది ఇన్చార్జి అధికారి ఏనాడూ కనిపించడం లేదు. అధికారి ఉండక విధులకు రాక ఖాళీ కుర్చీ దర్శనమిస్తోంది. పాఠకుల వాదనాల తో నవతెలంగాణ సోమవారం లైబ్రరీ శాఖను సందర్శించగా లైబ్రరీలో ఏ ఒక్కరు లేరు అధికారి లేక ఖాళీ కుర్చీ దర్శనం ఇచ్చింది. ఇక్కడ లైబ్రేరియన్ లో ఉద్యోగాల కోసం నిరుద్యోగ పాఠకులు చదువుకుంటున్నారు. అలాంటి వారికి కావలసిన పుస్తకాలు గానీ ఎలాంటి ఉద్యోగానికి ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలో చెప్పే వారే లేరు. మద్నూర్ లైబ్రరీ ప్రభుత్వం సొంత స్థలం కేటాయించి నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చింది తగిన సౌకర్యాలు కల్పించిన అధికారి మాత్రం కనిపించరు రోజువారిగా లైబ్రరీ ఓపెన్ చేయడం పాఠకులకు చదువుకోమని చెప్పడం అధికారి మాత్రం ఉండరు. ప్రభుత్వం పాఠకుల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క లైబ్రరీలో అధికారులను నియమిస్తే నెలల తరబడి అధికారులు విధులకు హాజరుకాకుండా కనిపించలేని పరిస్థితి కొనసాగుతోంది. సోమవారం నవ తెలంగాణ లైబ్రరీ శాఖకు సందర్శించగా లైబ్రరీలో కొంతమంది పాఠకులు చదువుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడం నవ తెలంగాణ ఖాళీ కుర్చీ దర్శనం ఇచ్చే ఫోటో చిత్రీకరించి చదువుకునే పాఠకులతో మాట్లాడగా సారు లేరు ఇక్కడ ఎవరూ లేరు కదా మీకు ఏదైనా అవసరం ఉంటే ఎవరికి అడుగుతున్నారు. మీకు కావలసిన పుస్తకాలు ఎవరు ఇస్తున్నారు. అనేదానికి పాఠకులకు అడిగి తెలుసుకోగా ఇక్కడ కిందిస్థాయి సిబ్బందికి అడిగే చదువుకుంటున్నామని పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad