Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ శాసనసభ

ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ శాసనసభ

- Advertisement -

– ప్రతిపక్షాలకూ మాట్లాడే స్వేచ్ఛనిచ్చాం
– ఆలిండియా స్పీకర్స్‌ కాన్ఫరెన్స్‌ లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రజస్వామ్య పద్దతిలో ప్రజల సంక్షమానికి అనుగుణంగా తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు సైతం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల పాటు సాగిన ఆల్‌ ఇండియా స్పీకర్స్‌ కాన్ఫరెన్స్‌ సోమవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రసంగించారు. తొలి శాసన సభాపతిగా విఠల్‌ బాయి పటేల్‌ వారసత్వాన్ని, వివలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ లేజిస్లేటివ్‌ చరిత్రలో విఠల్‌ బాయి పటేల్‌ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నా రు. న్యాయవాద వృత్తిలో, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. 1925 లో బ్రిటిష్‌ వలస పాలనలో విఠల్‌ బాయి పటేల్‌ సెంట్రల్‌ లేజిస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా ఎన్నికవడం ఆషామాషీ అంశం కాదన్నారు. ఆయన దైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, సెంట్రల్‌ అసెంబ్లీని సమర్ధవంతంగా నడిపించిన తీరు అసెంబ్లీ స్పీకర్లకు మార్గదర్శిగా నిలుస్తోందని కొనియాడారు. ఆయన స్పీకర్‌ గా ఉన్నప్పుడే 1929 లో భగత్‌ సింగ్‌, భటెకేశ్వర్‌ దత్‌ వలస పాలనను వ్యతిరేకిస్తూ సెంట్రల్‌ అసెంబ్లీలో బాంబుల విసిరారని గుర్తు చేశారు. ఆ సమయంలో విఠల్‌ బాయి పటేల్‌ ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారని తెలిపారు. ప్రపంచ దేశాల నాయకులతో కలిసి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కి మద్దతుగా బోస్‌-పటేల్‌ మ్యానిఫెస్టో ను దైర్యంగా ఆవిష్కరించారని చెప్పారు. అలా విఠల్‌ భారు ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ శాసనసభను నడుపుతున్నామని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల సంక్షేమానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad