![]() |
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్…
నవతెలంగాణ – డిచ్ పల్లి: భారతీయ రైల్వేలను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చేసి, ప్రజలపై భారాలు మోపొద్దని, రైల్వేలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతామని కార్మికులు, ప్రజలు హెచ్చరించారు. సోమవారం డిచ్ పల్లి రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లెకార్డులతో నిరసన చేపట్టి, స్టేషన్ మేనేజర్ గంగరాజు కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ.. రైల్వేలతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయరాదన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలలో మహిళలకు రక్షణ కల్పించి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైల్వే ప్రయాణికులు పాల్గొన్నారు.