Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమీ సేవ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వండి

మీ సేవ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వండి

- Advertisement -

సీఎం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు
మాజీ ఎమ్మెల్యే జూలకంటి నేతృత్వంలో వినతి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మీ సేవ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో మీ సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌, అధ్యక్షులు ఆర్‌.సురేశ్‌, ప్రధాన కార్యదర్శి జెనీమా, కోశాధికారి ఏవీబీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీసేవా సర్వీసుల్లో ప్రజల సౌకర్యార్ధం ప్రవేశపెడుతున్న అనేక సేవల వల్ల మీ సేవ ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్నదని వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, మధ్యలో వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో మీసేవ ఉద్యోగుల వేతనాల పెంపుదల ఆలస్యమవుతుందనీ, ఓపికపట్టి సహకరిస్తే వేతనాలు పెంచుతామని అధికారులు హామీనిచ్చిన విషయాన్ని ప్రస్తావిం చారు. తక్షణమే మీ సేవ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad