సమాచార స్పెషల్ కమిషనర్ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
పర్యావరణానికి హానిచేయని మట్టి విగ్రహాలతో వినాయకచవితి పండుగను నిర్వహించుకుందామని సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ బాగస్వాములు కావాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను స్పెషల్ కమిషనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని గుర్తుచేశారు. రసాయనాలు, పీవోపీతో తయారుచేసిన గణపతి విగ్రహాలను వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందనీ, పీవోపీ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకులు డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ రాధాకిషన్, డిప్యూటి డైరెక్టర్లు యం.మధుసూధన్, సి.రాజారెడ్డి, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES