- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీపాదరావు ఆలిండియా ఫిడే ఓపెన్ చెస్ గోల్డ్‌కప్ పోటీలు ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో హైదరాబాద్ చెస్ సంఘం అధ్యక్షులు కే.ఎన్.ప్రసాద్ ప్రకటించారు. టోర్నీ ప్రైజ్‌మనీ రూ.8 లక్షలు అని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టోర్నీకి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు పోటీలు జరుగుతాయనీ, టోర్నీలో పాల్గొనదలిచినవారు బుధవారం లోపు www.easypaychess.com వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని హైదరాబాద్ చెస్ సంఘం అధ్యక్షులు కే.ఎన్.ప్రసాద్ తెలిపారు.
- Advertisement -