- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మంగళ, బుధవారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
- Advertisement -