- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాల తర్వాత.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ యాత్రలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళ పాల్గొంటున్నారు. బీహార్‌లో ఓటరు జాబితాల్లో అక్రమాలను ఎండగట్టడానికీ ఈ యాత్రను చేపట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
- Advertisement -