- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో బుధవారం బడా గణేశ్ కొలువు ఉత్సవం జరుగనున్నందున, బుధవారం నుంచి సెప్టెంబర్ 6 వరకు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లస్ రోటరీ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. పది రోజులపాటు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు.
- Advertisement -