– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
– ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. ఇండ్ల విషయంలో అర్హులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పకుండా ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. మంగళవారం మండల కేంద్రానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన అందరికీ 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.
పథకాలు అందడంలో ఆలస్యమైన, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కకు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, ఉట్నూరి ప్రదీప్, నాయకులు దూలూరి కిషన్ గౌడ్, నల్ల గణేష్ గుప్తా, వేములవాడ జగదీష్, సింగిరెడ్డి శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES