అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు
నవతెలంగాణ – భువనగిరి
సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలు పూజించి కంకణ బద్దులు కావాలని స్థానిక సంస్థల పదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు భాస్కరరావు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మట్టి వినాయకునికి వాడటం వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి లోపలతో పాటు వివిధ మండపాలలో భారీ విగ్రహాలను మట్టితో చేయించినప్పుడు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తీ, మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, అధికారులు, నాయకులు, సిబ్బంది, పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES