Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅలల బీభ‌త్సం..బీచ్‌ రోడ్డు ధ్వంసం

అలల బీభ‌త్సం..బీచ్‌ రోడ్డు ధ్వంసం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్‌ లో అలల తాకిడి అధికంగా ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎగసిపడుతున్న రాకాసి అలలకు ఉప్పాడ శివారు రంగంపేట సమీపంలో బీచ్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. మరోపక్క రాకాసి అలలు రోడ్డుపైకి ఎగసి రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. కొంతమంది బైక్‌లపై వెళుతుండగా అలలు ఎగసిపడి రోడ్డుపైకి రావడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరోపక్క రంగంపేట, పల్లిపేట మత్స్యకార కాలనీలోకి సముద్రపు నీరు చేరుకుంటుంది. అలలు తాకిడి అధికంగా ఉన్నప్పుడు అధికారులు వాహనదారులను దారిమళ్ళిస్తే బాగుంటుందని లేనిపక్షంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని పలువురు చెబుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad