వామపక్ష పార్టీల పిలుపు..
నవతెలంగాణ – కంఠేశ్వర్
28న విద్యుత్ తమరవీరుల సమస్మరణ సభను జయప్రదం చేయండి అని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ నగర్ కార్యదర్శి. వై. ఓ మయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్ హాజరై మాట్లాడుతూ..2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను అమలజర్పటంలో భాగంగా విద్యుత్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. దీంతో చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వంద రోజులకు పైగా వివిధ ఆందోళనలు, పోరాటాలు నిర్వహించటం జరిగిందని తెలిపారు.
వేలాదిమంది ఈ పోరాటంలో కేసుల పాలైనారు వందలాది మంది జైల్లో మగ్గటం జరిగిందని, అంతిమంగా సంవత్సరం ఆగస్టు 28 నా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం వామపక్ష పార్టీల కార్యకర్తల పైన, ప్రజల పైన భాష పవాయు గోళాలను ప్రయోగించటంతో పాటు కాల్పులు జరపటం జరిగిందని అన్నారు.
దీంతో వందలాదిమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారని తీయడం జరిగిందని వెల్లడించారు. నాటి నుండి నేటి వరకు విద్యుత్ చార్జీల పెంపుదల పట్ల ప్రభుత్వాలు అడుగు వేయటానికి ఆ పోరాటం ద్వారా పడ్డదని వారు ఉన్నారు. విద్యుత్ అమరవీరులు 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 28న ధర్నా చౌక్ లో పీర్ల సంస్మరణ దినోత్సవం నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల శ్రేయోభిలాషులు ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నగర నాయకులు కటారి రాములు, సిపిఐ నాయకులు గంగాధర్, రంజిత్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.