5 బంగారు పతకాలు
మూడు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలు
అండర్ 16 బాలికల ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు సిహెచ్ ఉదయ్ 60 మీటర్ల పరుగు గోల్డ్ మెడల్ కార్తీక జావ్లిన్ త్రో గోల్డ్ మెడల్, అన్విత 60 మీటర్స్ పరుగు గోల్డ్ మెడల్, అద్విత లాంగ్ జంప్ గోల్డ్ మెడల్ అతుల్ పటేల్ బ్యాక్ త్రో గోల్డ్ మెడల్, క్రాంతి 600 మీటర్స్ సిల్వర్ మెడల్ లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ 60 మీటర్స్ పరుగు లో బ్రాంజ్ మెడల్, సుశాంత్ జావలిన్ త్రో బ్రాంజ్ మెడల్ లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సాధించారని పాఠశాల చైర్మన్ కె సంతోష్ కుమార్ కరస్పాండెంట్ శ్రీదేవి లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల తరఫున అభినందన సభను ఏర్పాటుచేసి క్రీడాకారులను అభినందించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత రెండు నెలలలో నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాల తరఫున విద్యార్థులు పాల్గొని రెండు ఛాంపియన్షిప్ లు సాధించడం, నలుగురు విద్యార్థులు ఉదయ్, కార్తీక, ఆన్విత అద్విత లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం గర్వకారణమని కొనియాడారు.
పాఠశాలలో విద్యార్థులకు చదువు తో పాటు ప్రత్యేకమైన క్రీడా ప్రణాళికను రూపొందించి, విద్యార్థులకు వివిధ క్రీడా అంశాలలో తర్ఫీదును ఇస్తున్నామని వారు తెలిపారు. గత సంవత్సర మా పాఠశాల తరఫున జాతీయస్థాయి హ్యాండ్ వాల్ పోటీల్లో పాల్గొన్న అంజలి జాతీయస్థాయి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. మెడల్ సాధించిన క్రీడాకారులకు శిక్షణను ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఏదైనా ఒక ఆటను ఎంచుకొని వ్యాయామ ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణను జాగ్రత్తగా చూసి పాటిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని హితవు చెప్పారు. నవంబర్ నెల లో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తవుతుందని విద్యార్థులు దీనిని సైతం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో హెచ్ఆర్ డైరెక్టర్ లత ప్రిన్సిపల్ ఆంథోనీ వైస్ ప్రిన్సిపల్ సరిత ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో మెరిసిన ఎన్జిఎస్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES