జిల్లా కలెక్టర్ రాహుల్ చర్మకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలం,ఆన్ సాన్ పల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నేఁబర్ 40 ప్రభుత్వ భూమి(అసైన్డ్ పట్టా)ను అక్రమంగా కబ్జాకు పాల్పడి ఆన్లైన్లో నమోదు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఎడ్ల కొమురయ్య, లౌడ్య భిక్షపతి మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించి నిరుపేదలైన ఎస్టీ,ఎస్సి లకు చెందేలా చేయాలన్నారు. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరంలో సర్వే నెంబర్ 40లో మొత్తం రక్బ 505 ఎకరాల లవాని పట్టా భూమిని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 0.20 గంటల నుంచి ఒక ఎకరం వరకు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసి అంతిమ, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేసిందని తెలిపారు.
అప్పటి నుంచి రైతులు మోకాపై ఉంటూ జీవిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆన్ సాన్ పల్లి,ఖాసింపల్లి, జంగెడు గ్రామాలకు చెందిన కొందరు కబ్జాదారులు 2018-19 సంవత్సరంలో అక్రమంగా ఒక్కొక్కరూ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఆన్లైన్లో పట్టాలు (ధరణి) చేసుకొని ప్రభుత్వం ఇచ్చే రైతుబందు పొందడమే కాకుండా మోకాపై కబ్జాలకు పాల్పడుతూ పేద రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లుగా వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోని అక్రమంగా కబ్జాలకు, ఆన్లైన్లో పట్టాలు పొందిన వారిపై చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES