పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. మంగళవారం మండలంలోని చల్వాయి పసర గోవిందరావుపేట గాంధీనగర్ లక్నవరం గ్రామపంచాయతీల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశోక్ హాజరై చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్స తీసుకున్న వారికి మందుల ఖర్చుల నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందిస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధ చెక్కుల సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారుల వివరాలు…
1. బేబీ సయ్యద్ షఫీ ఫాతిమా రూ.1,75,000/- బుస్సాపూర్ గ్రామం
2. ఇల్లందుల స్వరూప రూ.37,500/- చల్వాయి గ్రామం
3. పైడాకుల ఉమ రూ.30,000/- చల్వాయి గ్రామం
4. బత్తిని భీష్మ రూ.35,000/- చల్వాయి గ్రామం
5. మాలోత్ రిషి రూ.19,500/- గాంధీనగర్ గ్రామం
6. యాస రామచంద్రారెడ్డి రూ.30,000/- గోవిందరావుపేట గ్రామం
7. మిడిదొడ్డి రమాదేవి రూ.12,500/- గోవిందరావుపేట గ్రామం
8. నిడుమోలు రామయ్య రూ.25,000/- లక్నవరం గ్రామం
9. పంజాల మంజుల రూ.1,00,000/- పసర గ్రామం
మొత్తం తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.4,64,500/- (నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల) చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.