- Advertisement -
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా మట్టి గణపతులు
మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – రామారెడ్డి
పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మట్టి గణపతులను అందజేస్తున్నామని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్, ఎంఈఓ ఆనంద్ రావు, ఏపీఓ ధర్మారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -