జన్నారం మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్
నవతెలంగాణ – జన్నారం
జన్నారం దండేపల్లి లక్షట్ పేట కడెం దస్తరాబాద్ మండలాల మహిళల గుండెల్లో చిరస్థాయిగా వ్యక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ డా. ప్రవీణారెడ్డి అని జన్నారం మండల మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని డీసెంట్ మెడికల్ ముందు డా. ప్రవీణారెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మండలాల మహిళలకు ఎంతోమందికి కాన్పులు చేసి అమ్మ అనిపించుకున్న మహా నాయకురాలు అన్నారు. పేద ప్రజలకు తమ సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు. అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రావు కొంతం శంకరయ్య కాసెట్టి లక్ష్మణ్ రజాక్, సిటిమల భరత్ కుమార్ ఇందయ్య మున్వర్ అలీ ఖాన్, చిలువేరు నరసయ్య, బోర్లకుంట ప్రభుదాస్, ముత్యం రాజన్న శ్రీరాముల గంగాధర్ రవి ముదిరాజ్, డా. లక్ష్మణ్ ప్రవీణారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డా.ప్రవీణారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES