Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలువాహనాదారులకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ సౌకర్యం

వాహనాదారులకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ సౌకర్యం

- Advertisement -

ట్రాఫిక్ సిఐ ప్రసాద్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలో ఖలీల్ వాడికి వచ్చే వాహనాదారులకు పార్కింగ్ కొరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఏర్పాటు చేయడమైందని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రతిరోజు నగరంలోని ఖలీల్వాడిలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున ట్రాఫిక్ నియంత్రణకు కట్టడికి చర్యలు తీసుకోవడంలో భాగంగా కమిషనర్ సాయి చైతన్య ఖలీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ చేయాలని నిశ్చయించి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఇన్స్పెక్టర్ ప్రసాదు ను ఆదేశించగా కమిషనర్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సహకారంతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు పార్కింగ్కు ఏర్పాట్లు మంగళవారంం చేశారు.

ఈ సందర్భంభంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా పార్కింగ్ కొరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు, పార్కింగ్ స్థలంలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ కొరకు ఏర్పాటుచేసిన ప్రదేశాల వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని నగర ప్రజలు స్వాగతించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad