– ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
నవతెలంగాణ- సంగారెడ్డి :
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని 31,32 వార్డులో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, నవీన్, వార్డు మహిళలు ఉన్నారు.