ఎంఈవో శ్రీనివాస్, ఏపీఎం ఎండీ మహమూద్ పాషా
నవతెలంగాణ – పెద్దవంగర
మండలాన్ని సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేద్దామని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, ఏటీఎం ఎండీ మహమూద్ పాషా పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నవ భారత్ సాక్షరతా ఉల్లాస్ కార్యక్రమంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఉల్లాస్ పై వీవోఏ లకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలాన్ని సంపూర్ణ అక్షరాస్యత తో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామ స్థాయిలోని అక్షరాస్యత వలంటీర్లు సాయంత్రం రెండు గంటల సమయం కేటాయించి నిరక్షరాస్యులకు చదువు చెప్పాలన్నారు.
ప్రజలు వేలిముద్రలు వేయకుండా చదువు నేర్చుకుని చైతన్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. మండలాన్ని వంద శాతం అక్షరాస్యతగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. కాగా మండలంలోని 26 గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు ఒక వీవోఏ నిరక్షరాస్యులకు శిక్షణ ఇస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సత్యనారాయణ, సీసీలు బి. సుధాకర్, ఎస్.సుజాత, సీఆర్పీ సంతోష్, ఎమ్మెస్ అధ్యక్షురాలు జి. భద్రమ్మ, ఉపాధ్యాయులు, వీవో ఏలు పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES