Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్రైల్వే ప్రయివేటీకరణను ఆపాలి..

రైల్వే ప్రయివేటీకరణను ఆపాలి..

- Advertisement -

బుర్రి ప్రసాద్ , నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్ 
: భారతీయ రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే సూపర్డెంట్ కిశ్వర్ కుమార్ కిసమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం ప్లే కార్డులతో రైల్వే స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ లు మాట్లాడుతూ..  రైల్వేలో కూడా కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, బోనసు, కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు. అందువల్ల వీటి పరిష్కారం కోసం రైల్వే కార్మికులు సమ్మె చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. కావున పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ వన్ అనుసరిస్తూ 2025 మే 21న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రైల్వేలోని అన్ని విభాగాల లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందరూ పాల్గొంటారని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. రైల్వే ప్రయాణికులకు భద్రత పెంచాలని తెలిపారు. రైల్వే ఉద్యోగులకు సురక్షితమైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని, ప్యాసింజర్ రైలు పెంచాలన్నారు. ఎక్స్ప్రెస్ రైల్లో పేపర్స్ క్లాసులు, జనరల్ కంపార్ట్మెంట్స్ పెంచాలని కోరారు. రైళ్లల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే విస్తరణ, భద్రత కోసం అవసరమైన నిధులు కేటాయించాలని అన్నారు. రైల్వే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులపై వేధింపులు అరికట్టాలని హెచ్చరించారు. కనీస వేతనంనెలకు రూ.26,000/-లు చెల్లించాలి. కనీస పెన్షన్ రూ॥ 10000/- ఇవ్వాలి. ఎన్.పి.ఎస్ & యుపిఎస్ లను రద్దు చేయాలని తెలిపారు. పాత పెన్షన్ విదానాన్ని పునరుద్దరించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -