నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలములోని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన మట్టి వినాయకులను మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము సిబ్బంది కలిసి జీపీ కార్యదర్శులకు మంగళవారం మట్టి వినాయకులను అందించారు. అదేవిధంగా లొంగన్ గ్రామంలో కూడా ఎంపీడీవో మట్టి వినాయకులను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టి గణపతులు పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేయడం తో పాటు పలు విలువైన పర్యావరణ కాలుష్యం వలన జరిగే నష్టాన్ని అనే అంశం పైన సమాచారాన్ని గ్రామాలలో ప్రజలకు అవగాహన పరచాలని కార్యదర్శులకు ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ చాలా విలువైనదని అన్నారు.
పర్యావరణానికి ఎటువంటి ముప్పు మరియు కాలుష్యం జరగకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జీపీకి మట్టి వినాయకులను అందించడం లక్ష్యంగా పెట్టుకొని గ్రామస్తులకు కూడా అవగాహన పరచాలని సూచించారు. అదేవిధంగా ఎంపీడీవో, ఎంపీవో మాట్లాడుతూ 30 గ్రామ పంచాయతీల కార్యదర్శి లు మరియు మీ మీ గ్రామంలో ప్రజలకు మట్టి గణపతులు ఉపయోగించే విధంగా అవగాహన కల్పించవలెనని పంచాయతీ కార్యదర్శులకు తెలుపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ , మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ మధు, జూనియర్ అసిస్టెంట్ అనిల్, , గంగాధర్, సి ఓ లు ప్రవీణ్, భూమాగౌడ్ , అటెండర్లు సృజన్ , కిరణ్ మరియు ముప్పై జీపీ గ్రామపంచాయతీల కార్యదర్శులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎంపీడీఓ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES