Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఆయిల్ ఫామ్ లో అంతర  పంటలు - అదనపు ఆదాయానికి అవకాశాలు

ఆయిల్ ఫామ్ లో అంతర  పంటలు – అదనపు ఆదాయానికి అవకాశాలు

- Advertisement -

– డాక్టర్ నీలిమ
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫాంలో అంతర పంటలు సాగుతో రైతు అదనపు ఆదాయం పొందవచ్చునని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల జాతీయ సేవ సంస్థ ఆధ్వర్యం లో కళాశాలలో ను,దత్తత గ్రామం నారాయణపురం లో మంగళవారం “ఆయిల్ పామ్ లో అంతర  పంటలు – అదనపు ఆదాయానికి అవకాశాలు”, “సుస్థిర వ్యవసాయం” అంశాల పై రైతు శిక్షణా  కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ వేసిన మొదటి నాలుగు సంవత్సరాలు లోపు,ఎనిమిది సంవత్సరాలు దాటిన తోటల్లో అంతర పంటలు చేసుకోవచ్చని సూచించారు.  మొదటి నాలుగు  సంవత్సరాలు లోపైతే అరటి, బొప్పాయి,మిరప,పైన్ ఆపిల్   బీన్స్,మొక్కజొన్న,పత్తి,చెరుకు ,పూలతోటలు చేసుకోవచ్చని. ఎదిగిన తోటల్లో మిరియాలు, కోకో,హెలికోనియ,రెడ్ జింజర్ మొదలగు అంతరపంటలు వేసుకోవచ్చు అన్నారు.  

ఇలా వేసుకోడం వల్ల రైతుకి మంచి ఆదాయం లభించడమే కాక,వ్యవసాయం లోని అనిశ్చితి ని తగ్గించుకొని సుస్థిర ఆదాయం కూడ వస్తుందని డాక్టర్ నీలిమ పేర్కొన్నారు. 

అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి కుమార్ మాట్లాడుతూ  దత్తత గ్రామ కార్యక్రమం లో భాగంగా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందం గా ఉందని అభిప్రాయపడ్డారు. నారాయణపురం గ్రామ రైతులు సుస్థిర వ్యవసాయాన్ని పాటించాలని, అందులో ముఖ్యం గా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు అంతర పంటల వైపు మక్కువ చూపాలని కోరారు.కీటక శాస్త్రవేత్త  డాక్టర్ రవి కుమార్ పత్తి,మిరప మరియు ఆయిల్ పామ్ లో ఈ వానాకాలం లో పంట ను ఆశించే చీడ పీడల గురించి మరియు వాటి యాజమాన్యం గురించి వివరించారు.మృత్తిక శాస్త్ర నిపుణుడు డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయం లో ఎరువులు ఎంతో ప్రాధాన్యం అని తెలిపారు.

రైతులు యూరియా ని సరైన సమయం లో తగు మోతాదులో వాడుకోవాలని, మరియు ఇతర ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు.సేద్య శాస్త్రజ్ఞురాలు స్రవంతి ఆయిల్ పామ్ లో సాగు చేయదగ్గ వ్యవసాయ అంతర పంటలు, వాటి యాజమాన్యం గురించి వివరించారు.  

దత్తత గ్రామ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం లో సూచించిన ముఖ్యమైన అంశాలను రైతులు పాటించాలని కోరారు. కమిటీ లో భాగంగా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతారని తెలియచేసారు.పెరటి తోటల పెంపకం,విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి,వివిధ వ్యవసాయ,ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి శిక్షణ కార్యక్రమాలు, రోగ నిర్ధారణ సందర్శనలు మొదలగు కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియచేసారు. 

ఈ శిక్షణా కార్యక్రమం బోధనా  సిబ్బంది జంబమ్మ,శ్రీ జన్,వ్యవసాయ శాఖ మండల అధికారి శివ రామ్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి షకీరా భాను పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad