నవతెలంగాణ – సదాశివనగర్
జిల్లా పరిషత్ హై స్కూల్ సదాశివనగర్ పాఠశాలలో మంగళవారం సదాశివ నగర్ మండల లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మేళాలో తెలుగు ఆంగ్లము గణితము పరిసరాల విజ్ఞానానికి సంబంధించి 30 పాఠశాల చెందిన ఉపాధ్యాయులు కృత్యాదార పద్ధతిలో బోధించడానికి వీలుగా వర్కింగ్ మోడల్స్ను ను అద్భుతంగా తయారుచేసి ప్రదర్శించడం జరిగింది. ఇట్టి మేలాను ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారి శ్రీ యూసఫ్ మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్యను టిఎల్ఎం ఉపకరణాల ద్వారా అందించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా విద్యార్థులు మరింత ఆసక్తితో నేర్చుకుంటారని, ఈ మేళాలో పాల్గొన్న ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి అభినందించడం జరిగింది. ఇందులో ప్రథమ ద్వితీయ బహుమతులు పొందిన ఉపాధ్యాయులకు మెమెంటో ప్రశంసా పత్రంతో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు LFL ప్రధానోపాధ్యాయులు మండల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొనడం జరిగింది.
సదాశివ నగర్ మండల స్థాయి టీఎల్ఎం మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES