– ఆక్రమించిన వారు శిక్షార్హులు
– తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారాయణపురం ఎస్సీ కాలనీ లోగల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ను అనుకుని ఉన్న ఖాలీ స్థలాన్ని తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, ఆర్ఐ నాగరాజు లు మంగళవారం ప్రభుత్వ భూమి గా గుర్తించి నిభందనలు అతిక్రమించి ఆక్రమించిన వారు శిక్షార్హులు అవుతారని హెచ్చరిక ప్రకటన బోర్డ్ ను ఏర్పాటు చేసారు.
గత వారంలో నారాయణపురం లోని దళితేతరులు కొందరు ఆ ఖాలీ స్థలాన్ని గణేష్ ఉత్సవాలకు వినియోగించాలని ప్రయత్నించారు.ఇది గమనించిన దళిత యువకులు ఖాళీ స్థలం బడి కి ఆట స్థలంగా నే ఉండాలని ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించడం కుదరదని పట్టుబట్టారు.ఈ క్రమంలో ఇరువర్గాలకు వాగ్వాదం చోటు చేసుకుంది.ఇదే విషయాన్ని నవతెలంగాణ మాత్రమే కధనం ప్రచురించింది.
స్థానిక దళిత యువకులు సోమవారం ప్రజావాణి లో బడి స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞాపన సైతం చేసారు.దీంతో స్పందించిన అధికారులు ఆ స్థలం రక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో బోర్డ్ ఏర్పాటు చేసారు.