Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రాంగణ నియామకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రాంగణ నియామకాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న సౌఖ్యాంపస్ లో మంగళవారం ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన 50 మంది విద్యార్థులు హాజరైనట్లు సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన 12 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. అనంతరం క్యాంపస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రాంగణ నియామకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూర్, చేగుంట ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు, క్యాంపస్ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad