- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని సహ చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహ చట్టం ఒక వజ్రాయుధం అని, ప్రతి ఒక్క విద్యార్థి సహ చట్టం గురించి తెలుసుకోవాలని చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహ చట్టం తెలంగాణ రాష్ట్ర సలహాదారులు రమణారెడ్డి, రాష్ట్ర స్పోక్స్ మాన్ న్యాయవాది శ్రీనివాసరావు, నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రషీదా బేగం, కామారెడ్డి పట్టణ కార్యదర్శి రాహుల్, ప్రిన్సిపాల్ శ్రీలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -