- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మలేరియా, డెంగ్యూ రక్త పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని, జ్వరం ఉన్నవారికి ఆర్ డి టి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి యేమిమా తెలిపారు. గ్రామస్తులందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి పూజ, ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
- Advertisement -