Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు అవుతున్న గణపతి విగ్రహాలు తో నీటి కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా పలు స్వచ్చంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నారు. లయన్స్ క్లబ్,వాసవి క్లబ్, ఆధ్వర్యంలో మంగళవారం మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా,విరివిగా పంపిణీ చేస్తున్నారు. 

లైన్స్ క్లబ్ ఆద్వర్యంలో లయన్ కంచర్ల రమేష్ ఆర్ధిక సౌజన్యంతో యువ వికాస్ విభాగంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ప్రసంగాలను ఏర్పాటు చేసారు.బాల్యం నుండే వ్యక్తిగత వికాసం పెంపొందించే విధంగా ప్రసంగాలు ఇచ్చారు. వాసవి క్లబ్ ఆద్వర్యంలో అద్యక్షులు సత్యవరపు బాలగంగాధర్ ఉచిత మట్టి ప్రతిమలను పంచారు.

ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ చైర్ పర్సన్స్ సాతులూరి సత్యనారాయణ,మోటివేషన్ స్పీకర్ గా మణుగూరు ప్రభుత్వ కళాశాల లెక్చరర్  ఎన్.ప్రకాష్,స్థానిక సిఐ నాగరాజు,ఎస్సై యయాతి రాజు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది లక్కినేని నరేంద్ర బాబు,సీనియర్ లయన్ సభ్యులు యూఎస్ ప్రకాష్, కొఠారి చలపతిరావు,కోటగిరి మోహన్ రావు, జూపల్లి బ్రహ్మ రావు, దూబగుంట్ల దుర్గారావు, బలమూరి సూర్య రావు, వి కే డి వి ఎస్ కళాశాల ప్రిన్సిపల్ శేషు బాబు,స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad