డబ్బులు ఇస్తేనే అన్లోడ్
లారీ డ్రైవర్ల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మోషన్ పూర్, ఉప్పల్వాయి గ్రామాల మధ్య నిర్మించిన గోదాములకు లారీల ద్వారా పిడిఎస్ బియ్యాo, ఆహార ధాన్యాలను నిలువ చేయడానికి లారీల ద్వారా తరలిస్తుండగా, యజమాన్యం లారీల నుండి అన్లోడ్ చేయడం లేదని ఉమ్మడి జిల్లా లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం యూనియన్ అధ్యక్షులు ఎండి దావూర్ ఆలీ మాట్లాడుతూ… గత వారం రోజుల నుండి బియ్యాన్ని అప్లోడ్ చేయడం లేదని, గోదాముల వద్ద కనీస సౌకర్యాలు లేవని, తాగడానికి నీరు కూడా లేదని, చాయ్ త్రాగడానికి 3 కిలోమీటర్లు నడవవలసి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4450 తీసుకొని అన్లోడ్ చేస్తున్నారని, అదనంగా డబ్బులు ఎవరు ఇస్తే వారి వారిని ముందు అన్లోడ్ చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై జిల్లా డిఎం స్పందించాలని కోరారు. ధర్నా నిర్వహిస్తుండగా గోదామించార్జి సందీప్ స్పందించి, రేపటిలోగా 85 లారీలను అన్లోడ్ చేస్తానని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ధర్నా విరమించారు. ధర్నాలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సలీం, డ్రైవర్ శంకర్,అరిఫ్, మోసిన్ ఖాన్, సయ్యద్, హబీబ్, శంషాద్దీన్, సలీం అలీ, ఉమ్మడి జిల్లా లారీ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లారీలను వెంటనే అన్లోడ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES