Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నాకు తెలియకుండానే బ్యాంక్ రుణం.!

నాకు తెలియకుండానే బ్యాంక్ రుణం.!

- Advertisement -

బాధితురాలు కొప్పుల చంద్రక్క
నవతెలంగాణ – మల్హర్ రావు(మహాముత్తారం)

తనకు తెలియకుండానే దక్కన్ గ్రామీణ బ్యాంకు అధికారులు రుణం ఇచ్చి, డబ్బులు వేరే వ్యక్తికి ట్రాన్స్ పార్ చేశారని భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన కొప్పుల చంద్రక్క ఆరోపించింది. ఆమె పూర్తి కథనం ప్రకారం..  తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రూ. 1,48,000 ఖాతాకు సెప్టెంబర్ 2023వ సంవత్సరంలో లోన్ సాంక్షన్ అయింది. డబ్బులు జమైన విషయం తనకు తెలియకుండా డిసెంబర్ 30,2023వ సంవత్సరంలో బ్యాంకు మేనేజర్ తన దగ్గర వ్యక్తి అయిన మధ్య వర్తికి రూ.1 లక్ష 48 వేలు ట్రాన్స్ఫర్ చేశాడని, జులై 22, 2025 తేదీన చంద్రక్క రైతుబంధు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లగా తన ఖాతాలో రూ.1 లక్ష 48 వేలు జమ అయ్యాయని, మళ్లీ అవి బ్యాంకు మేనేజర్ వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశాడని తెలిసిందని చంద్రక్క లబోదిబోమని మొత్తుకుంది.

చంద్రక్క అకౌంట్లో డబ్బులు జమ అయినా కారణంగా ఆమె రెన్యువల్ చేసి వడ్డీ కట్టాలని జులై 23, 2025న బ్యాంకు మేనేజర్ చంద్ర అక్కను ఆశ్రయించారు. బ్యాంకు మేనేజర్ ఆమెపై వడ్డీ కట్టాలని ఒత్తిడి చేయగా నాకు అందులో ఒక రూపాయి కూడా తెలియదని ఆమె మేనేజర్ తో వాదించింది.ఈ విషయంపై నవ తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సంతోష్ ను వివరణ కోరగా చంద్రక్కకు తెలియకుండా లోన్ ఇవ్వలేదని ఆమె అన్ని పైళ్లపై సంతకాలు చేస్తేనే లోన్ ఇచ్చామని తెలిపారు. అలాగే చంద్రక్క కేశవులు అనే వ్యక్తికి తన ఖాతాలోని డబ్బులు జమ చేయలనడంతో జమ చేసినట్లుగా తెలిపారు.

అధికారులపై చర్యలు తీసుకోవాలి: పీక కిరణ్ ..ప్రజాప్రంట్ జిల్లా అధ్యక్షుడు

బాధితురాలు చంద్రక్కకు తెలియకుండా మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులు అమాయకురాలును మోసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. మండలంలో ఇలాంటి బాధితులు ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad