నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడానికి యువతి నిరాకరించిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. తాజాగా బీజేపీ నేత అన్నామలై చేతుల మీదుగా మెడల్ అందుకోవడానికి ఓ ఆటగాడు నిరాకరించాడు. ఇటీవల జరిగిన 51వ రాష్ట్రస్థాయి షూటింగ్ గేమ్స్ జరిగాయి. ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజన్ కుమారుడు సూర్య రాజ బాలు పతకం గెలుపొందారు. ఈ అవార్డుల ప్రదానోత్స కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్ బహూకరించారు. అయితే సూర్య మెడలో అన్నామలై పతకం వేయబోతుండగా పక్కకు తప్పుకున్నాడు. చేతితో దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బీజేపీ నేత అన్నామలైకు చేదు అనుభవం(వీడియో)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES