నవతెలంగాణ – శంకరపట్నం
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన కేశవపట్నం గ్రామంలో పర్యటించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే, దోమల బెడద తగ్గుతుందని, తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని వివరించారు. అంతేకాకుండా, మంచి పోషకాహారం తీసుకోవాలని, శుభ్రమైన తాగునీరు వాడాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES