నవతెలంగాణ – జుక్కల్
పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని హంగర్గా గ్రామ పంచయతీ కార్యదర్శి అశోక్ గౌడ్ అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో ఏర్పాటు చేసన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నిర్దేశించి మాట్లాడారు. గ్రామాలలోని ప్రజలు పర్యావరణం పరిరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకులను వాడడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతున్నదని ప్రభుత్వం గుర్తించి ప్రజలకు అవగాహన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జీపీకి మట్టి వినాయకులను సరఫరా చేసి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిపి సెక్రెటరీ అశోక్ తో పాటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES