నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా టి ఎల్ ఎం మేళా మంగళవారం జరిగింది. పిల్లలలో జ్ఞానాన్ని పెంచే విధంగా ,సులువుగా నేర్చుకునే విధంగా ఉపయోగపడుతుందని జుక్కల్ ఎంఈఓ తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చసిన కార్యక్రమంలో మండలంలోని మమదాబాద్, వజ్రకండి, బస్వాపూర్ గ్రామాలలో ఉన్న ప్రైమరీ పాఠశాలను ఎంపిక చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రైమరీ పాఠశాలల ఉపాద్యాయులు అందరూ అనేక నమూనాలు తయారు చేశారు అని అన్నారు . ప్రథమ స్థానం లో నిలిచిన 10 నమూనాలను జిల్లా సాయికి పంపించటం జరుగుతుంది అని జుక్కల్ మండల విద్య అధికారి తిరుపతయ్య తెలిపారు.
మండల స్థాయిలో గెలుపొందిన వారందరికీ ఉపాధ్యాయులు ఎంఈఓ కలిసి ఘనంగా సన్మానం చేశారు జ్ఞాపికలను అందిదేసి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హనుమంత రెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు లాలయ్య , శ్రీనివాస రావు ఉపాధ్యాయులు పి ఆర్ టి యు మండల నాయకులు , వజ్రకండి హెచ్ఎం బాబు సార్, మమదాబాద్ హెచ్ఎం కాంబ్లే గోపాల్, బస్వాపూర్ హెచ్ఎం జై చంద్, మొదలైన వారు పాల్గొన్నారు.
టిఎల్ఎం మేళాలో జుక్కల్, వజ్రకండి పాఠశాలలు.. ప్రథమ ద్వితీయ స్థానాలు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES