ప్రభుత్వాస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాస్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం రూ. 276 లక్షల నిధులు మంజురయ్యాయి అని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ మంగళవారం ప్రకటనలు తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రెయినేజ్ మరమ్మత్తులు, తలుపులు-కిటికీలు, భద్రతా గ్రిల్లులు, హ్యాండైలింగ్ ఏర్పాటు, భవనం ముఖభాగం మరమ్మత్తులు, Palliative care center అభివృద్ధి, వి ఆర్ డి ఎల్ ల్యాబ్ మరమ్మత్తులు, టి హబ్ విస్తీర్ణ పనులు చేపడతారు. ఈ నిధుల మంజూరుకు జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం లభించింది. వారి కృషి వలననే ఈ మంజూరు సాధ్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభమై ఆస్పత్రి వసతులు మరింత మెరుగుపడి, ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించబడతాయి. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేలూ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
జిల్లా ప్రభుత్వాస్పత్రికి నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES