నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రజలకు జిల్లా మెజిస్ట్రేట్ అండ్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట మంగళవారం 28 మందిని బైండోవర్ చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గణేష్ విగ్రహాల నిమజ్జనము, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవం సందర్భంగా పి. సాయి చైతన్య ఆదనపు జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ ఆదేశాల ప్రకారం , డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్ , నిజామాబాద్ డివిజన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ల లలో గతంలో నమోదైన కేసులలోని నిందితులను వచ్చే (6) నెలల పాటు సత్ప్రవర్తన ను కొనసాగించుటకు, డీజే యజమానులకు రూ.2 లక్షలు, ట్రబుల్ మాంగర్స్ కు 1 లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50,000/- స్వంత పూచీకత్తు పై పి. సాయి చైతన్య ఆదనపు జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ ముందు బైండ్ ఓవర్ చేయబడ్డారు. పై పూచీకత్తు కాలంలో మళ్ళీ నేరాలు చేసినట్లు అయితే పూచీకత్తు ఇచ్చిన రూపాయలను జప్తు చేయబడును లేని యెడల జైలు శిక్ష విధించబడును అని తెలియజేశారు. 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో 4గురు, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు, నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు, ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు, నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో 9 మంది మొత్తం ఏడు పోలీస్ స్టేషన్ పరిధిలో 28 మంది కి బైండోవర్ చేశారు.
28 మందిని బైండోవర్ చేసిన సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES