నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ షీటీమ్ బృందం ఏఎస్ఐ సదయ్య అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని జిల్లాల గడ్డ గ్రామంలో గ్రామస్తులకు సైబర్ నేరాలు మహిళల రక్షణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాట్సప్ కు వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని ,ఎవరైనా బ్యాంకు అధికారులని మాట్లాడితే బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ఎవరికీ తెలుపవద్దని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 ఫిర్యాదు చెయ్యాలన్నారు.మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేసిన, అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దన్నారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి, కానిస్టేబుల్ కృష్ణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ హెడ్ కానిస్టేబుల్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -



