నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై పలువురు అన్నదాతలు మంగళవారం బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే నాటు వేసి చాలా రోజులు అవుతుందని, పంటచేను ఎర్రబారుతున్నాయని, పొట్టకచ్చే చేనుకు మందు చల్లుదామంటే మందు బస్తాలు లేవని అన్నారు. ఇక్కడ సరఫరా చేసే కేంద్రానికి 10 రోజుల నుంచి ఒక సగం లోడు మాత్రమే వచ్చిందని, 200 బస్తాలు ఎంత మందికి ఇస్తారని ప్రశ్నించారు. కనీసం ఒక లోడు వచ్చిన మరింత మందికి వచ్చేవని తెలిపారు. మాకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు రైతులకు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని సరిపడా యూరియా సరఫరా చేస్తామని వారిని సముదాయించి ధర్నా విరమింపజేశారు.
యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES