జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
జ్వరం వచ్చిన రోగుల రక్తనమూనాలు సేకరిస్తు చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. మంగళవారం జ్వరాల నియంత్రణలో భాగంగా తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెఓ మాట్లాడుతూ జ్వరాల నివారణకు డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆశాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తు ఆంటీ లార్వాలను తొలగించాలన్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరిస్తు చికిత్స అందించాలని పీహెచ్సీ వైద్యాధికారికి సూచించారు. మందుల నిల్వలను పరిశీలించి సరిపడా మందులను నిల్వ ఉంచుకోవాలని, ఆరోగ్య మహిళ పరీక్షలు పెంపొందించాలని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అఫీజా కు సూచించారు. అనంతరం డెంగ్యూ నివారణలో భాగంగా ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత, రాపిడ్ యాక్షన్ టీం సూపర్ వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రోగుల రక్త నమూనాలు సేకరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES