Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుస్థానిక సమరంపై కసరత్తు

స్థానిక సమరంపై కసరత్తు

- Advertisement -

– తుది ఓటర్ల జాబితా నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం
– రేపటిలోగా పంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా
– సెప్టెంబర్‌ 2న తుది ఓటర్ల జాబితా
– 29, 30తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు
– 30న అభ్యంతరాల స్వీకరణ… 31న తుది జాబితా ప్రచురణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై ఓవైపు రాష్ట్ర సర్కారు న్యాయకోవిదులతో సమాలోచనలు జరుపుతుండగా.. మరోవైపు హైకోర్టు విధించిన సెప్టెంబర్‌ 30 గడువు ముంచుకొస్తున్న నేపథ్యం లో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ముమ్మరం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వ హణ కోసం పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, తుది ఓటర్ల జాబితా నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమి షనర్‌ రాణి కుముదిని మంగళవారం విడుదల చేశారు. నోటిఫికేషన్‌కు అనుగుణంగా నడుచుకో వాలని హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరిలకు మినహా అన్ని జిల్లాల అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అన్ని పంచాయతీల్లోనూ, మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ గ్రామపంచాయతీ, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను తయారు చేసి ఈ నెల 28లోగా ప్రదర్శించాలని పంచా యతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదే శించింది. ఈ నెల 29న రాజకీయ పార్టీల ప్రతిని ధులతో జిల్లాస్థాయి ఎన్నికల అధికారులు సం యుక్త సమావేశాన్ని, 30వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండలస్థాయి సమావేశాన్ని ఎంపీ డీఓలు నిర్వహించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను 28 నుంచి 30 వతేదీ వరకు ఎన్నికల అధికారులు స్వీకరించను న్నారు. ఈ నెల 31వరకు అభ్యంతరాలను డీపీఓ పరిశీలిం చనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ రెండో తేదీన గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు విడుదల చేయనున్నారు.
ముంచుకొస్తున్న గడువు.. ‘బీసీ’ల చుట్టూ హడావిడి
రాష్ట్రంలో గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం గతేడాది జనవరి 31తో ముగిసింది. గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా ఎన్నికలు నిర్వహించట్లేదని పలువురు హైకోర్టును ఆశ్రయిం చగా.. స్థానిక ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర సర్కారును ఆదేశించిన విషయం విదితమే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదం పొం దింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆ బిల్లును పంపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఎటూ తేల్చకుండా దాన్ని పక్కన పడేసింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలంటూ గవర్నర్‌కు రాష్ట్ర సర్కారు ప్రతిపాదించగా.. న్యాయ సలహా పేరుతో కేంద్ర న్యాయశాఖకు పంపిం చారు. ఇప్పటి వరకూ దానిపై ఎటూ తేల్చలేదు. ఆ బిల్లును ఆమోదించాలంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పక్షాలు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే. అయినా, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. మరోవైపు బీసీ రిజర్వేషన్‌ కోటాలో 10 శాతం మంది ముస్లింలను చేర్చారని ఆరోపిస్తూ బీజేపీ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నది. రిజర్వేషన్ల కోటా పరిమితి మించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమనే వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. బీజేపీ వాదన సహేతుకం కాదం టూ బీసీ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. దేశ జనాభాలో రెండూ మూడు శాతానికి మించి లేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు బీజేపీ నేతలకు ఎందుకని ఆయా పార్టీలు బాహాటంగానే ప్రశ్నిస్తు న్నాయి. దీనిపై రాజకీయ రచ్చ నడుస్తుండగా.. మరోవైపు హైకోర్టు ఇచ్చిన గడువు ముంచుకొస్తు న్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నది. ఒకవేళ అమలు సాధ్యం కాని పక్షంలో బీజేపీ బీసీ రిజర్వే షన్లను అడ్డుకుంటున్నదని చెబుతూ.. జిల్లా/మండ లాల వారీగా బీసీ అభ్యర్థులకు 42 శాతం సీట్లను కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమా వేశాల్లో కాళేశ్వర ప్రాజెక్టు నివేదికపైనా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad