– 15 రోజుల్లో జాయిన్ కావాలి : డాక్టర్ ఇ.నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 4,454 మంది టీచర్లకు పదోన్నతి కల్పించినట్టు పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. పదోన్నతుల ఆర్డర్స్ అందుకున్న వారు 15 రోజుల్లో కొత్త పోస్టులో చేరాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్దేశించుకున్న సమయంలోపు పదోన్నతులు పూర్తి చేసినట్టు తెలిపారు. మొత్తం 880 మంది స్కూల్ అసిస్టెంట్లు హెడ్ మాస్టర్ గ్రేడ్ -2 (గెజిటెడ్)గా పదోన్నతి పొందగా, 3,574 మంది సెకెండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా, దానికి సమానమైన కేడర్లకు పదోన్నతి పొందారు. హెడ్ మాస్టర్ గ్రేడ్ -2 (గెజిటెడ్) పదోన్నతి పొందిన వారిలో మల్టీ జోన్ – 1 నుంచి 490 మంది ఉండగా, మల్టీ జోన్-2 నుంచి 390 మంది ఉన్నారు. కాగా స్కూల్ అసిస్టెంట్లుగా 2,763 మంది పదోన్నతి పొందగా, 811 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ (పీఎస్ హెచ్‌ఎం, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం)గా ప్రమోషన్ పొందారు. భవిష్యత్తులోనూ బదిలీలు, పదోన్నతులు ఖాళీలు, అర్హులైన అభ్యర్థుల అందుబాటు మేరకు క్రమపద్ధతిలో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
4,454 మంది టీచర్లకు పదోన్నతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES